వైఎస్సార్‌సీపీ ఒంటరిగానే పోరాటం చేస్తుంది.. మీలాగా రోజుకో పార్టీతో కాదు

22 Oct, 2021 16:47 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: రాష్ట్రంలో ప్రజలు బీజేపీకి ఓటు వేసే పరిస్థితి లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. బద్వేలు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 'బద్వేల్ నీటి సమస్యపై బహిరంగ చర్చకు సిద్ధం. టీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ట్యాంకర్లతో నీళ్లు తోలారు. మా ప్రభుత్వం వచ్చాక బ్రహ్మసాగర్ రిజర్వాయర్ ద్వారా సమృద్ధిగా నీరు అందిస్తున్నాం. బద్వేల్ అభివృద్ధి కోసం మా ప్రభుత్వం ఎప్పుడూ చిత్తశుద్ధితో ఉంది.

చదవండి: (చంద్రబాబు డైరెక్షన్‌లోనే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు: సజ్జల)

బీజేపీకి ఓటు వేస్తే చెల్లని ఓటుగా మిగులుతుంది. వైఎస్సార్‌సీపీని విమర్శించడమే అజెండాగా బద్వేల్ ఎన్నికలను బీజేపీ వాడుకుంటోంది. కేంద్ర నిధులు అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఉపఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిస్తే ఆరోపణలు చేసేందుకు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ ఒంటరిగానే పోరాటం చేస్తుంది. మీలాగా రోజుకో పార్టీతో కాదు. టీడీపీ వాళ్లపై ఆధారపడి ఎన్నికల్లో ఉనికిని కాపాడుకొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. 

చదవండి: (తినడానికి వీలుగా మా అల్లుడు తెర కట్టుకుని దీక్ష చేస్తున్నాడు: లక్ష్మీపార్వతి)

మరోవైపు చంద్రబాబు హైడ్రామా కొనసాగుతోంది. వ్యూహాత్మకంగా రాజకీయ కుట్రతో ముఖ్యమంత్రి ని తిట్టించడం.. గందరగోళం సృష్టించడం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా సీఎం జగన్‌ ఉండటాన్ని వారు భరించలేకపోతున్నారు. ఢిల్లీకి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలడానికి వెళ్తున్నారా. అమిత్ షా ను కలిసి చంద్రబాబు ఏం చెప్తారు. తిరుపతిలో రాళ్లు వేసిన సంగతిని అమిత్‌ షాకు గుర్తు చేస్తారా..?. దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలు ఏపీలో అమలవుతున్నాయి. ఎన్నికల కోడ్ వల్ల బద్వేల్ అభివృద్ధి తాత్కాలికంగా ఆగిపోయింది. బద్వేలు ఉప ఎన్నికలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది' అని కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. 

మరిన్ని వార్తలు