మరోసారి విషం చిమ్మిన ‘ఈనాడు’.. మంత్రి కాకాణి ఫైర్‌

8 Apr, 2023 18:24 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: వ్యవసాయశాఖపై ‘ఈనాడు’ మరోసారి విషం చిమ్మిందని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. విలువలు, విషయ పరిజ్ఞానం లేకుండా కథనాలు రాస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో  వ్యవసాయ రంగంలో 13.18 శాతం వృద్ధి రేటు నమోదైందని తెలిపారు. గత ప్రభుత్వంలో వృద్ధి రేటు పెరగలేదని.. ఉత్పత్తి తగ్గిందని గుర్తు చేశారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు అందించామని.. పొలం బడి ద్వారా రైతులకు అవగాహన కల్పించామని చెప్పారు.

శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో భూగర్భ జలాలు అడుగంటిపోయి 1,623 కరువు మండలాలను ప్రకటించారని, తమ ప్రభుత్వంలో ఒక్క కరువు మండలం కూడా ప్రకటించలేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కరువు రావాలని, రైతులు విలవిలలాడాలని రామోజీ కోరుకుంటున్నారని నిప్పులు చెరిగారు. మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబుది అయితే మహిళలను అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం వైఎస్‌ జగన్‌ది’ అని స్పష్టం చేశారు.
చదవండి: జగన్ అంటే అభిమానం, అంత కంటే మించి ప్రాణం

‘చంద్రబాబులాంటి పనికి మాలిన వ్యక్తులు తిడితే పట్టించుకోం. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రతి ఇంటికి వెళ్తే జనాలు చెబుతారు. అక్కడికి వెళ్ళి బాబు సెల్ఫీ తీసుకోవాలి. మా ప్రభుత్వంలో వ్యవసాయం లాభసాటిగా మారింది. మేము తీసుకున్న విధానాలు వల్ల ఉత్పత్తి పెరిగింది. రైతులకు గిట్టుబాటు వస్తుంటే చంద్రబాబు, సోమిరెడ్డి కడుపు మండుతుంది. గత ప్రభుత్వంలో సోమిరెడ్డి మిల్లర్ల వద్ద ముడుపులు తీసుకుని వారిని మోసం చేశారు. 

పారదర్శకంగా పరిపాలన చేశానని చంద్రబాబు చెప్పలగలరా? మేము చేసిన అభివృద్దిని చూపిస్తూ చంద్రబాబు సెల్పీలు తీసుకోవడం సిగ్గు చేటు. జిల్లాలో టీడీపీ  భూస్థాపిమైనదని నిన్న జరిగిన సమీక్షలో చంద్రబాబు ఒప్పుకున్నారు. చంద్రబాబుకు పాజిటివ్ ఓటు బ్యాంక్ లేదు.. ఆయన అంతంటి మోసగాడు లేడని టీడీపీ నేతలే చెబుతున్నారు. చంద్రబాబు పర్యటనల వల్ల మా పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు’ అని మంత్రి కాకాణి అన్నారు.

మరిన్ని వార్తలు