Let's have a race: సీఎం చౌహాన్‌కు కమల్‌నాథ్‌ చాలెంజ్‌

4 Oct, 2021 08:16 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ (74)ఆరోగ్యంపై పదేపదే కామెంట్లు చేస్తున్న సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌(62)కు కమల్‌నాథ్‌ ఓ చాలెంజ్‌ విసిరారు. ‘నా ఆరోగ్యంపై పెద్ద చర్చ జరుగుతోంది. కమల్‌నాథ్‌ అనారోగ్యంతో ఉన్నారు, వృద్ధుడయ్యాడని చౌహాన్‌ అంటున్నారు. మీకు నేను చాలెంజ్‌ విసురుతున్నాను. ఇద్దరం కలసి పరుగుపందెంలో పాల్గొందాం.

చదవండి: రైతుల ఆందోళనలో ఘర్షణ.. 8 మంది మృతి

నాకు న్యూమోనియా ఉంది. అది తప్ప మిగిలిన రిపోర్టులు అన్ని సాధారణంగానే ఉన్నాయి. న్యూమోనియా ఉన్నందునే పోస్ట్‌ కోవిడ్‌ పరీక్షలు చేయించుకున్నాను. కాంగ్రెస్‌ పార్టీతో ఉన్న బాధ్యతల రీత్యా ఢిల్లీలో ఉన్నాను తప్ప ఆరోగ్యం గురించి కాదు’ అని పేర్కొన్నారు.  కమల్‌ అనారోగ్యంతో ఉన్నారని చౌహాన్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా కమల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు