‘ఐటెం’ వ్యాఖ్యలపై కమల్‌నాథ్‌ విచారం

21 Oct, 2020 08:15 IST|Sakshi

‘ఐటెం’ వ్యాఖ్యలపై  మాజీ సీఎం యూటర్న్

సాక్షి, భోపాల్‌: మధ్యప్రదేశ్‌ మంత్రి ఇమార్తీదేవిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం కమల్‌నాథ్‌ విచారం వ్యక్తం చేశారు.  వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాజుకున్న హై-వోల్టేజ్ డ్రామా అనంతరం మాజీ  ముఖ్యమంత్రి యూ టర్న్ తీసుకున్నారు.  ఆ మహిళా మంత్రిని అగౌరవపరిచేలా తానేమీ మాట్లాడలేదని, క్షమాపణ చెప్పబోనని స్పష్టం చేశారు.  (‘కమల్‌ నాథ్‌ వ్యాఖ్యలను సమర్ధించను’)

ఆదివారం జరిగిన ఉప ఎన్నికల ప్రచార ర్యాలీలో మంత్రి ఇమార్తీదేవిని కమల్‌నాథ్‌ ‘ఐటెం’ అంటూ అగౌరవంగా సంబోధించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ స్పందిస్తూ.. ఆ భాష సరైంది కాదన్నారు. అవమానకరంగా మాట్లాడిన కమల్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కాంగ్రెస్‌ అధిష్టానాన్ని డిమాండ్‌ చేశారు.
 

మరిన్ని వార్తలు