ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పకుంటే!...మరో వివాదంలో కంగన రనౌత్‌

2 Dec, 2020 13:01 IST|Sakshi

న్యూ ఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగన రనౌత్‌ మరోసారి తన మాటలతో సమస్యల్లో చిక్కుకుంది. షహీన్‌ బాగ్‌ దాదీలలో ఒకరైన బిల్కిస్‌ బానోపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇబ్బందుల్లో పడేశాయి. నిరసనలలో కనిపించడానికి బిల్కిస్‌ బానో రూ.100 తీసుకుంటారని కంగన చేసిన ట్విట్‌పై దూమరం రేగింది. (చదవండిశాసన మండలికి ఊర్మిళ?)

' హా హా హా ఏ దాదీ అయితే అత్యంత శక్తివంతమైన భారతీయురాలిగా టైమ్‌ మ్యాగజైన్‌లో చూసామో ఆమె ఇప్పుడు వంద రూపాయలకి నిరసనలలో అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ ప్రజాసంబంధ సంస్థను భారతదేశానికి సంబంధించి కాకుండా, పాకిస్తాన్‌కి సంబంధించి ఎంచుకున్నారు. ఇటువంటి వాటి గురించి అంతర్జాతీయంగా మాట్లాడటానికి సొంత వాళ్లు కావాలి' అని కంగనా ట్వీట్‌ చేశారు.

ఎంఎస్‌ మొహిందర్‌ కౌర్‌ని చూసి బిల్కిస్‌ బాను అనుకోని కంగనా ట్వీట్‌ చేసినందుకు లీగల్‌ నోటీసులు పంపిచానని న్యాయవాది హకమ్‌ సింగ్‌ పేర్కొన్నారు. వంద రూపాయలకి నిరసనలకి వస్తుంది అనే వ్యాఖ్యలపై ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా కేసును కొనసాగిస్తామని తెలిపారు. 'ఫ్యాక్ట్‌ చెక్‌' అనే ఆన్‌లైన్‌ పోర్టల్‌లో బానో మాట్లాడుతూ...నేను ఆరోజు నిరసనలో పాల్గొనలేదని, షహీన్‌ బాగ్‌లోని తన నివాసంలోనే ఉన్నానని, ఫోటోలో కనిపించింది నేనుకాదని అన్నారు.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణ దర్యాప్తు సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలతో వెలుగులోకి వచ్చిన రనౌత్‌ నిత్యం ఏదొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటుంది. మహారాష్ట్ర రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు కూడా ఆమెను చిక్కుల్లో పడేశాయి.  ముంబైని పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చినందుకు శివసేన పార్టీ నాయకులు ఆమెపై దుమ్మెత్తిపోశారు.(చదవండియూపీ సీఎంతో బాలీవుడ్‌ హీరో భేటీ)

మంగళవారం నటి ఊర్మిళ శివసేనలో చేరిన సంగతి విధితమే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...' కంగనకు కావాల్సిన ప్రాముఖ్యత దక్కింది. నేను తనతో మాటల యుద్ధంలో పాల్గొనాలని అనుకోవడంలేదు. నేను ఆమె అభిమానిని కాదు. మనమందరం తన గురించి తను కోరుకున్నదానికంటే ఎక్కువగానే మాట్లాడుకున్నాం ఇక ఇప్పుడు మాట్లాడటానికి ఏమి లేదని అనుకుంటున్నాను. మనం ప్రజాస్వామ్యదేశంలో నివసిస్తున్నాం ప్రతి పౌరుడికి వాక్‌ స్వేచ్ఛ ఉంది కాబట్టి వారు ఏం చేయానుకుంటున్నారో చేయోచ్చు' అని అ‍న్నారు.

మరిన్ని వార్తలు