ఇది ఆరంభం మాత్రమే : కంగనా సంచలన వ్యాఖ్యలు

6 Apr, 2021 09:44 IST|Sakshi

‘ఇది కేవలం ఆరంభం మాత్రమే.. ముందుముందు చాలానే ఉంది’: ఫైర్‌ బ్రాండ్‌ ఫైర్‌

హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌​ రాజీనామా : కంగనా రనౌత్‌  వ్యాఖ్యల దుమారం

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా  చేసిన అనంతరం ట్విటర్‌లో  స్పందించారు.  సాధువులను హత్య చేసి.. స్త్రీలను వేధించి, హింసించేవారికి ఎప్పటికైనా పతనం తప్పదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ అనిల్‌ దేశ్‌ముఖ్‌నుద్దేశించి హెచ్చరించారు. అంతేకాదు ముందు ముందు ఏం జరుగనుందో చూస్తూ ఉండు అంటూ ఫైర్‌ బ్రాండ్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా గతంలో తన ఆఫీసుపై దాడి, కూల్చివేత విషయాలను గుర్తు చేస్తూ  చేసిన ఒక ట్వీట్‌ను రీట్వీట్‌ చేయడం గమనార్హం. ఇప్పటికే శివసేన, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సమయంలో  కంగనా వ్యాఖ్యలు మరోసారి అగ్గి రాజేశాయి.  (సంచలనం: మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా)

కాగా ముంబై మాజీ పోలీసు చీఫ్ పరం బీర్ సింగ్  హోంమంత్రి దేశ్‌ముఖ్ మీద చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు సోమవారం ఆదేశించింది. 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ నిర్వహించాలని హైకోర్టు  సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.  దీంతో అనిల్‌ దేశ్‌ముఖ్‌ మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు