ఒక సినిమా పోతే మరో సినిమా.. అదే పవన్ విధానం: అడపా శేషు

8 Dec, 2023 15:04 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: తెలంగాణలో డిపాజిట్లు కోల్పోవడంతో పవన్‌కు మతి భ్రమించిందని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో పవన్‌కు ప్రజలు ఓటేయలేదని, అక్కడ ఓడిపోగానే వైజాగ్ వచ్చి ఊగిపోతున్నాడని మండిపడ్డారు.

‘‘తెలంగాణలో బీజేపీతో ఏపీలో టీడీపీతో పవన్ జతకలిశాడు. పవన్ తీరు అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాలాగే ఉంది. అక్కడ పోతే బీజేపీ పోయిందని వదిలేశాడు. ఇక్కడ చంద్రబాబు కోసం ఆరాట పడుతున్నాడు. ఒక సినిమా పోతే మరో సినిమా అదే పవన్ విధానం. కాపులను చంద్రబాబుకు తాకట్టు పెట్టాడు. ఏపీకి ఏం చేస్తాడని పవన్‌ను ప్రజలు నమ్మాలి’’ అంటూ శేషు ధ్వజమెత్తారు.

చంద్రబాబుకు నిజంగా దమ్ముంటే ఎందుకు క్యాండెట్‌ను పెట్టలేదు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఫైనాన్షియర్ మాత్రమే. రేవంత్ గెలిస్తే ఏపీలో ఒక సామాజిక వర్గం సంకలు గుద్దుకుంటోంది, పవన్‌ను నమ్ముకున్నందుకు తెలంగాణలో బీజేపీకి పట్టిన గతే ఏపీలో టీడీపీకి పడుతుంది. అధికారం, అహంకారానికి అసలైన రూపం చంద్రబాబు. సెక్రటేరియట్ సాక్షిగా నాయిబ్రాహ్మణుల తోకలు కట్ చేస్తానన్న వ్యక్తి చంద్రబాబు. సీఎం జగన్‌ గురించి మాట్లాడే స్థాయి పవన్‌కు లేదు’’ అని అడపా శేషు మండిపడ్డారు.

పవన్ ఉన్నత వర్గాలకు కొమ్ము కాస్తున్నాడు. ఊగిపోతూ పవన్ చెప్పే ఉపన్యాసాలకు కాలం చెల్లింది. సీఎం జగన్‌ అందించిన సంక్షేమం వల్ల కోవిడ్ సమయంలో ఎంతో మంది ప్రాణాలతో నిలబడ్డారు. సీఎం జగన్‌కి చిరునవ్వు తప్ప.. అహంకారమంటే తెలియదు. సినిమాల నుంచి వచ్చాడు కాబట్టి ఎవరు నష్టపోయినా పవన్‌కు పట్టదు. పవన్ కచ్చితంగా జనసేన శ్రేణులకు సమాధానం చెప్పే రోజు వస్తుంది. పవన్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే ప్రతీ ఒక్క వైసీపీ కార్యకర్త మాట్లాడాల్సి వస్తుంది’’ అడపా శేషు హెచ్చరించారు.
చదవండి: బాబు కూల్చారు.. జగన్‌ పునర్నిర్మించారు

>
మరిన్ని వార్తలు