‘కింగ్‌మేకర్‌’ కలలు భగ్నం.. కర్ణాటకలో చతికిలపడిన జేడీఎస్‌.. దెబ్బతీసిన కుటుంబ వివాదాలు..

14 May, 2023 07:32 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రాంతీయ పార్టీ అయిన జేడీ(ఎస్‌)ను పూర్తిగా నిరాశపరిచాయి. ఆ పార్టీ కేవలం 19 సీట్లు గెలుచుకుంది. మరోసారి ‘కింగ్‌మేకర్‌’ అవ్వాలన్న జేడీ(ఎస్‌) కలలు భగ్నమయ్యాయి. కర్ణాటకలో 2004, 2018లో హంగ్‌ ప్రభుత్వాలు ఏర్పడి జేడీ(ఎస్‌) అధికారంలోకి వచి్చంది. హంగ్‌ వచి్చన ప్రతిసారీ ఆ పార్టీ కింగ్‌మేకర్‌ అవతారం ఎత్తుతూ వచి్చంది. 2004లో బీజేపీతో, 2018లో కాంగ్రెస్‌తో జతకట్టింది.

కంచుకోటలో ప్రభావం అంతంతే
2018 ఎన్నికల్లో 37 స్థానాల్లో గెలుపొందిన జేడీ(ఎస్‌) ఈసారి మాత్రం 19 సీట్లకే పరిమితం అయింది. తమ కంచుకోటగా భావించే పాత మైసూరు ప్రాంతంలోనూ జేడీ(ఎస్‌) పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికల ముందు ‘పంచరత్న రథయాత్ర’ పేరిట జేడీ(ఎస్‌) నేత, మాజీ సీఎం కుమారస్వామి చేసిన రాష్ట్రవ్యాప్తంగా చేసిన బస్సు యాత్ర సత్ఫలితాన్ని ఇవ్వలేదు.

87 ఏళ్ల రాజకీయ దురంధరుడు హెచ్‌డీ దేవెగౌడ వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో విరివిగా పాల్గొన్నారు. అధికారం అప్పగిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రజలను వేడుకున్నారు. అయినా ఉపయోగం కనిపించలేదు. రాష్ట్రంలో జేడీ(ఎస్‌) ఓట్ల శాతం క్రమంగా పడిపోతోంది. 2004లో ఆ పారీ్టకి 20.8 శాతం, 2018లో 18 శాతం,  ఈసారి దాదాపు 13 శాతం ఓట్లు లభించాయి.

నిఖిల్‌ గౌడ పరాజయం
దేవెగౌడ కుటుంబంలోని లుకలుకలు కూడా ఈ ఎన్నికల్లో జేడీ(ఎస్‌)ను దెబ్బతీశాయి.  దేవెగౌడ పెద్ద కోడలు భవానీ రేవణ్ణ.. హాసన్‌ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డారు. ఆ స్థానాన్ని తన వదినకు ఇచ్చేందుకు కుమారస్వామి సానుకూలంగా లేకపోవడంతో కుటుంబంలోని విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇలా కుటుంబంలో వివాదాలు, పారీ్టలో కుటుంబ పెత్తనం అనే అపవాదులు జేడీ(ఎస్‌)ను దెబ్బతీశాయి.

దేవెగౌడ కుటుంబం నుంచి ముగ్గురు పోటీ చేయగా, ఇద్దరు గెలిచారు. కుమారస్వామి కుమారుడు నిఖిల్‌∙రామనగరలో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. 2019 లోకసభ ఎన్నికల్లో ఓటమిని పరాజయం పాలైన నిఖిల్‌ తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓడిపోవడం గమనార్హం. హాసన్‌లో దేవెగౌడ కుటుంబాన్ని సవాలు చేసిన బీజేపీ అభ్యర్థి ప్రీతం గౌడ తన ప్రత్యర్థి  హెచ్‌పీ స్వరూప్‌ను ఓడించారు. చెన్నపట్టణలో కుమారస్వామి స్వల్ప మెజారిటీతో గట్టెక్కడం జేడీ(ఎస్‌) కొంతలో కొంత ఊరట కలిగించింది. హోలెనరసిపురలో దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్‌డీ రేవణ్ణ గెలుపొందారు.
చదవండి: శభాష్‌ రాహుల్‌.. మహాత్మా గాంధీలా ప్రజల మనసులు గెలుచుకున్నావ్‌.. కమల్ ప్రశంసల వర్షం..

మరిన్ని వార్తలు