సీఎంపై సొంత పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు 

8 Apr, 2021 08:25 IST|Sakshi

సాక్షి,బళ్లారి: రాష్ట్ర రాజకీయాల్లో ఈనెల 17 తర్వాత పెనుమార్పులు చోటు చేసుకుంటాయని, పలువురు ఎమ్మెల్యేలు సీఎంపై తిరుగుబాటు చేసే అవకాశం ఉందని సీనియర్‌ బీజేపీ నేత, ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ పేర్కొన్నారు. ఆయన బెళగావి జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ ఎవరెవరి బలం ఏమిటో, బలహీనత ఎంత ఉందో కాలమే నిర్ణయిస్తుందన్నారు. సూర్యచంద్రులు ఉండే వరకు ఏమైనా యడియూరప్ప మాత్రమే సీఎంగా కొనసాగుతారా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఆయనను సీఎంగా హైకమాండ్‌ కొనసాగించడమే అదృష్టంగా భావించాలన్నారు. మే 2 తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు ఉండవచ్చన్నారు. ఉత్తర కర్ణాటకకు చెందిన వ్యక్తిని సీఎంని చేయడానికి పార్టీ నేతలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.   

ఎమ్మెల్యే కుమారునిపై దాడి
తుమకూరు: తురువేకెరె ఎమ్మెల్యే జయరాం కుమారుడు తేజు జయరాంపై మంగళవారం రాత్రి  దుండగులు దాడి చేశారు. ఈ ఘటన  గుబ్బి తాలూకా నెట్టికెరె క్రాస్‌ వద్ద చోటు చేసుకుంది. వివరాలు... తేజు జయరాం బెంగళూరు నుంచి స్వగ్రామం  అంకల కొప్పకు కారులో వస్తుండగా దుండగులు  అడ్డగించి గొడవకు దిగి దాడి చేశారు. ఇంతలోనే స్థానికులు రావడంతో దుండగులు ఉడాయించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని  తేజును ఆస్పత్రికి తరలించారు. కాగా దుండగులు వదలి వెళ్లిన కారును పరిశీలించగా బ్యాట్, కారంపొడి, పెద్ద కత్తి లభ్యమయ్యాయి.  సీజ్‌ చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

చదవండి: ముఖ్యమంత్రికి హెలికాప్టర్‌ కష్టాలు
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు