కొలువుదీరిన బొమ్మై కొత్త టీం.. యడ్డీ కుమారుడికి నిరాశ

4 Aug, 2021 17:03 IST|Sakshi
కర్ణాటకలో కొలువుదీరిన బొమ్మై కొత్త కేబినెట్‌

బెంగళూరు: కర్ణాటక కొత్త కేబినెట్‌ కొలువుదీరింది. కొత్త ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఎంపిక చేసిన 29 మంది బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. కర్ణాటక గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లోత్‌ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త కేబినెట్‌లో మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు విజేయంద్రకు చోటు దక్కుతుందని ఊహాగానాలు వచ్చినప్పటికి.. చివరకు ఆయనకు మొండి చేయి ఎదురయ్యింది. కొత్త మంత్రలు జాబితాలో యడ్డీ కుమారుడి పేరు లేకపోవడం గమనార్హం. అలానే ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండనున్నట్లు భావించినప్పటికి.. చివరికి ఒక్కరికి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కలేదు.

ప్రమాణ స్వీకారం చేసిన 29 మంది వీరే..
2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త మంత్రులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నేడు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో గోవింద్‌ కరజోల్‌, కేఎస్‌ ఈశ్వరప్ప, ఆర్‌ అశోక, బి. శ్రీరాములు, వి. సోమన్న, ఉమేశ్‌ కత్తి, ఎస్‌. అంగర, జేసీ మధుస్వామి, అరగ జ్ఞానేంద్ర, కోట శ్రీనివాస పూజారి, మురేగేశ్‌ నిరానీ, శివరామ హెబ్బార్‌, సీఎస్‌ అశ్వథ్‌నారాయణ, అరగ జ్ఞానేంద్ర, సీసీ పటేల్‌, ఆనంద్‌ సింగ్‌, ఎస్‌టీ సోమేశేఖర్‌, బీసీ పటేల్‌, బీఏ బసవరాజు, డాక్టర్‌ కె.సుధాకర్‌, కె.గోపాలయ్య, శశికళ జొల్లె, ఎంటీబీ నాగరాజ్‌, కేసీ నారయణ గౌడ, బీసీ నగేష్‌, వి.సునీల్‌ కుమార్‌, హాలప్ప ఆచార్‌, శంకర్‌ పాటిల్‌ ముననకొప్ప, మునిరత్న ఉన్నారు. 

సామాజిక వర్గాల వారిగా.. 
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల జాబితాను పరిశీలిస్తే.. అన్ని సామాజిక వర్గాల వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. బొమ్మై కేబినెట్‌లో ఎనిమిది మంది లింగాయత్‌ సమాజిక వర్గానికి చెందిన వారు ఉండగా.. ఒక్కలిగల నుంచి ఏడుగురు, ఓబీసీ నుంచి ఏడుగురు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు, ఎస్టీల నుంచి ఒకరు, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి, మహిళల నుంచి ఒకరికి చోటు దక్కింది. 

మరిన్ని వార్తలు