‘అధికారంలోకి వస్తే అఖండ బళ్లారి’ 

6 Dec, 2021 08:11 IST|Sakshi

సాక్షి, బళ్లారి అర్బన్‌(కర్ణాటక): వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే విడిపోయిన విజయనగరను తిరిగి కలిపి  అఖండ బళ్లారిగా ఒకే జిల్లాను చేస్తామని ఎమ్మెల్యే నాగేంద్ర తెలిపారు. ఆదివారం స్థానిక మోకా రోడ్డు ఓ ఫంక్షన్‌ హాల్‌ ఏర్పాటు చేసిన విధాన పరిషత్‌ ఎన్నికల బళ్లారి గ్రామీణ ప్రచార సభను ప్రారంభించి మాట్లాడారు. అనుభవజ్ఞుడైన అభ్యర్థి కేసీ కొండయ్యను గెలిపించాలన్నారు. కాంగ్రెస్‌ నాయకులు అల్లం వీరభద్రప్ప తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు