Karnataka New Governor: గెహ్లాట్‌ ప్రస్థానం

7 Jul, 2021 07:45 IST|Sakshi

సాక్షి బెంగళూరు: కేంద్ర మంత్రి థావర్‌చంద్‌ గెహ్లాట్‌ కర్ణాటక కొత్త గవర్నర్‌గా రాబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రకటించింది. ప్రస్తుత గవర్నర్‌ వజుభాయి వాలా పదవీకాలం చాలా నెలల క్రితమే ముగిసినా పొడిగిస్తూ వస్తున్నారు. ఆ పొడిగింపు కూడా ఈ ఆగస్టుతో ముగియనుంది. అనంతరం ఆయన స్థానంలో 73 ఏళ్ల గెహ్లాట్‌ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.  

స్వస్థలం మధ్యప్రదేశ్‌
గెహ్లాట్‌ మధ్యప్రదేశ్‌లోని రుపేటా గ్రామంలో 1948, మే 18న దళిత కుటుంబంలో జన్మించారు. విక్రం విశ్వవిద్యాలయంలో బీఏ డిగ్రీ పూర్తి చేశారు. సోషల్‌ సైన్సెస్‌లో గౌరవ డాక్టరేట్‌ పొందారు. బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సజాపూర్‌ లోక్‌సభ స్థానం నుంచి 1996–2009 మధ్య ఎంపీగా పలుమార్లు గెలుపొందారు. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.

ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2014 నుంచి పనిచేస్తున్నారు. ఇక ప్రస్తుత గవర్నర్‌ వజూభాయ్‌ వాలా 2014, సెప్టెంబరులో గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అంతకుముందు ఆయన గుజరాత్‌ ఆర్థిక మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితునిగా పేరుంది. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు