నాయకత్వ మార్పు ప్రసక్తే లేదు.. వారిపై కఠిన చర్యలు

19 Jun, 2021 14:06 IST|Sakshi

కోర్‌ కమిటీ సమావేశం అనంతరం మంత్రి అశోక్‌ వెల్లడి 

సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో నాయకత్వ మార్పు ప్రశ్నే లేదని  రెవెన్యూ మంత్రి ఆర్‌.అశోక్‌ స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం అనంతరం భేటీలో తీసుకున్న అంశాలు, తీర్మానాలపై మీడియాకు వివరించారు. పార్టీ, ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్‌ కమిటీ మీటింగ్‌లో తీర్మానించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో నాయకత్వ మార్పు అంశం చర్చకు రాలేదన్నారు. యడియూరప్పే తమ నాయకుడని పేర్కొన్నారు.  ప్రభుత్వ, బీజేపీ ప్రతిష్ట పెరిగేలా చేయాలని సమావేశంలో తీర్మానించినట్లు చెప్పారు. ఈనెల 21న  ప్రతి తాలూకాలో యోగా దినోత్సవాన్ని,  23న శ్యామ్‌ప్రకాశ్‌ ముఖర్జీ జన్మదినం సందర్భంగా బూత్‌స్థాయి కార్యక్రమాలు చేపట్టాలని, జూలై 6 వరకు ముఖర్జీ జ్ఞాపకార్థం మొక్కల నాటే కార్యక్రమాలను కొనసాగించాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు.    

పార్టీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దు  
బీజేపీకి నష్టం చేకూర్చే వ్యాఖ్యలను అధిష్టానం ఎంతమాత్రం సహించబోదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి అరుణ్‌ సింగ్‌ హెచ్చరించారు. శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో  కమిటీ పదాధికారులు, వివిధ మోర్చా అధ్యక్షులతో ఆయన సమావేశమై చర్చించారు.  రాష్ట్రాధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్, రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి అరుణ్‌ కుమార్‌ పాల్గొన్నారు. పార్టీ బలోపేతంతో పాటు రానున్న జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికల సిద్ధతపై చర్చించారు. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలతో కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారని అరుణ్‌ సింగ్‌ హెచ్చరించారు. పార్టీని దిగువ స్థాయి నుంచి బలోపేతం చేయాలని, అందరూ కలసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు.  

ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌
బనశంకరి: బీజేపీ నేతలతో శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీసీలో జాతీయ ప్రధాన కార్యదర్శులు, పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. కర్ణాటక నుంచి అరుణ్‌సింగ్, సీటీ.రవి, నళిన్‌కుమార్‌కటీల్‌ పాల్గొ

మరిన్ని వార్తలు