‘లాటరీ పద్ధతిలో ఆయనకు సీఎం కుర్చీ’

6 Dec, 2021 07:22 IST|Sakshi

సాక్షి, శివాజీనగర(కర్ణాటక): సీఎం బొమ్మై ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందినవారు కాదు. యడియూరప్పను తొలగించినప్పుడు లాటరీ పద్ధతిలో ఆయనకు సీఎం కుర్చీ లభించింది. బొమ్మైను సాగనంపాలని మంత్రి ఈశ్వరప్ప యత్నిస్తున్నారు అని సీఎల్పీ నేత సిద్ధరామయ్య అన్నారు.  ఆదివారం బెళగావి జిల్లా రాయదుర్గ తాలూకాలో కాంగ్రెస్‌ భేటీలో మాట్లాడారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌వారు గాడ్సే వంశీకులని ఆరోపించారు. 

కాంగ్రెస్‌పై సీఎం విసుర్లు 
బొమ్మనహళ్లి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజాబలం లేకపోవడంతో డబ్బు బలంతో గెలవాలని యత్నిస్తోందని సీఎం బసవరాజు బొమ్మై ఆరోపించారు. ఆదివారం బెంగళూరు శివార్లలోని ఆనేకల్‌ తాలూకా అత్తిబెలె వద్ద బీజేపి అభ్యర్థి గోపినాథ్‌రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని  మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య పదేపదే బీజేపీ డబ్బులతో అధికారంలోకి వస్తోందని ఆరోపిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ నాయకులు కోటీశ్వరులకు టికెట్లు ఇస్తే, బీజేపీ సామాన్యులను పోటీలో నిలిపిందన్నారు.  

మరిన్ని వార్తలు