వెన్నుపోటుదారులకు నువ్వు మద్దతివ్వలేదా?

26 Sep, 2022 05:14 IST|Sakshi

బాలకృష్ణకు మంత్రి కారుమూరి ప్రశ్న

తణుకు అర్బన్‌: ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి కుర్చీలో కూర్చున్న చంద్రబాబుకు సహకరించింది నువ్వు కాదా బాలకృష్ణా అంటూ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.

తణుకులో ఆదివారం ఆయన మాట్లాడుతూ..ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిగా దించేసి, కుంగి కృశించి మృతి చెందడానికి కారణమైన చంద్రబాబును నీవు భుజాలపైకి ఎక్కించుకోలేదా అని బాలకృష్ణను ప్రశ్నించారు.

సినిమాల్లో విలన్‌లాంటి పాత్ర పోషిస్తున్న చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నప్పుడే నీ తండ్రిపై నీకు ఎంతప్రేమ ఉందో ప్రజలందరికీ అర్థమైందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌కి ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంది కాబట్టే ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టారని చెప్పారు.  

మరిన్ని వార్తలు