మహిళా బిల్లు కోసం ఒత్తిడి తేవాలి

6 Sep, 2023 03:39 IST|Sakshi

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఆమోదింపజేయాలి

వివిధ రాజకీయ పార్టీలకు కవిత లేఖ

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదింపచేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్లమెంటు లో ప్రాతినిధ్యం కలిగిన 47 రాజకీయ పార్టీల అ«ధ్యక్షులతో పాటు దేశంలోని ఇతర పార్టీల నేతలకు కవిత మంగళవారం లేఖ రాశారు.

రాజకీయాలకతీతంగా మహిళా బిల్లు కోసం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి ఆమోదించేలా చొరవ తీసుకోవాలని కోరారు. దేశ జనాభాలో మహిళలు 50% ఉన్నా చట్టసభల్లో మాత్రం సరైన ప్రాతినిధ్యం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో ఇప్పటికే దాదాపు 14 లక్షల మంది మహిళలు క్రియాశీలక ప్రజా జీవితంలో ఉన్నారని గుర్తుచేశారు. లింగ సమానత్వం కోసం చారిత్రక నిర్ణయం తీసుకోవాలని రాజకీయ పార్టీలకు ఆమె పిలుపునిచ్చారు. 

రాజకీయ పార్టీలకు లేఖలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎంలు వైఎస్‌ జగన్, ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, నితీశ్‌కుమార్, నవీన్‌ పట్నాయక్, హేమంత్‌ సోరెన్, ఏక్‌నాథ్‌ షిండేతో పాటు మాయావతి, శరద్‌ పవార్, అఖిలేశ్‌ యాదవ్, సీతారాం ఏచూరి, చంద్రబాబు, వైఎస్‌ షర్మిల, చంద్రశేఖర్‌ ఆజాద్, పవన్‌ కల్యాణ్, లాలూ ప్రసాద్‌ యాదవ్, అర్వింద్‌ దేవే గౌడ,  ప్రకాశ్‌ అంబేడ్కర్‌కు కవిత లేఖలు రాశారు. 

మరిన్ని వార్తలు