పేదల భూములను లాక్కునేందుకే కేసీఆర్‌ ధరణి పోర్టల్‌

10 Aug, 2022 03:47 IST|Sakshi

అధికారంలోకి రాగానే ఆ భూమి ఇచ్చేస్తాం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

తాళ్లసింగారంలో ‘చాయ్‌ పే చర్చా’

లింగోజిగూడెంలో రచ్చబండ 

సాక్షి, యాదాద్రి/చౌటుప్పల్‌: కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కేసీఆర్‌ బొక్కేస్తుండటం వల్లే మీ వరకు రావడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజలనుద్దేశించి అన్నారు. పేదల భూములను లాక్కునేందుకే కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ తెచ్చారన్నారు. ప్రభుత్వం లాక్కున్న భూములను రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే తిరిగి పేదలకు పంచుతామని వెల్లడించారు. మేము ఎన్నికల కోసం రాలేదని, ఇక్కడ ప్రజా సంగ్రామయాత్ర మొదలయ్యాకే ఉప ఎన్నిక వచ్చిందన్నారు. ప్రజా సంగ్రామయాత్రలో భాగంగా మంగళవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా తాళ్లసింగారంలో ‘చాయ్‌ పే చర్చా’, లింగోజిగూడెంలో రచ్చబండ కార్యక్ర మాలను నిర్వహించారు. ఈ ప్రాంతంలో కాలుష్యం వెదజల్లే పరిశ్రమలతో జనం ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరెంట్‌(పవర్‌) ఇవ్వని కేసీఆర్‌ పవర్‌ను కట్‌ చేద్దామని చెప్పారు. కాగా, తాళ్లసింగారంలో నిర్వహించిన చాయ్‌పే చర్చలో పలు వురు మహిళలు మాట్లాడుతూ.. గ్యాస్, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని, ధరలు తగ్గించిన పార్టీకే ఓటేస్తామ న్నారు. సంజయ్‌ బదులిస్తూ.. గ్యాస్‌ విషయంలో పెద్దగా భారం పడటం లేదని, నెలకు రూ.30 మాత్రమే భారం పడుతోందని చెప్పారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిన నేపథ్యంలోనే ధరలు పెరిగాయని వెల్లడించారు. 

రైతు సమస్యలపై రచ్చబండ.. 
కేసీఆర్‌ ప్రభుత్వం రుణమాఫీ చేయడంలేదని, ధరణిలో అవి నీతి, రెవెన్యూ వ్యవస్థలో లంచాలు పెరిగాయని రైతులు బండి సంజయ్‌ దృష్టికి తెచ్చారు. కొన్ని కెమికల్‌ కంపెనీలు కాలు ష్యం వెదజల్లుతున్నాయని, ఈ ప్రాంతంలో పంటలు పండే పరిస్థితి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లింగోజి గూడెం గ్రామస్తులు బండి సంజయ్‌ వద్ద వాపోయారు. 

7వ రోజు 12.6 కిలోమీటర్లు యాత్ర..
సంజయ్‌ ప్రజా సంగ్రామయాత్ర 7వ రోజైన మంగళవారం 12.6 కిలోమీటర్లు సాగింది. ఉదయం చౌటుప్పల్‌ మండలం తాళ్లసింగారంలో ప్రారంభమై.. వివిధ గ్రామాల మీదుగా నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లికి చేరుకుంది. 

మన జెండా గొప్పతనాన్ని ప్రపంచమే గుర్తించింది..
మన జాతీయ జెండా గొప్పతనాన్ని యావత్‌ ప్రపంచ మంతా గుర్తించిందని బండి అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహో త్సవాలను పురస్కరించుకొని మంగళవారం యాదాద్రి భువ నగిరి జిల్లా చౌటుప్పల్‌లో స్వాతంత్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపా ధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనో హర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి తదితరులు పాల్గొన్నారు.
చదవండి: మునుగోడులో టీఆర్‌ఎస్‌ దిద్దుబాటు

మరిన్ని వార్తలు