మాయమాటలు చెబుతూ మత్తులో ముంచడం టీఆర్‌ఎస్‌ పార్టీకే చెల్లుతుంది

1 Oct, 2022 08:48 IST|Sakshi

మర్రిగూడ: ఎంతో మంది త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో నేడు కేసీఆర్‌ కుటుంబపాలన కొనసాగుతోందని, దోచుకున్న సొమ్ముతో విమానాలు కొంటున్నారంటే పాలన ఏవిధంగా ఉందో అర్ధమవుతుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. ఆయన శుక్రవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో బహుజన రాజ్యాధికార యాత్ర నిర్వహించారు.

ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. గ్రామాల్లో వన భోజనాలు, బతుకమ్మ చీరలతో మాయమాటలు చెబుతూ మత్తులో ముంచడం టీఆర్‌ఎస్‌ పార్టీకే చెల్లుతుందన్నారు. ఫార్మా కంపెనీలు, రీజినల్‌ రింగురోడ్ల పేర్లతో బడుగు, బలహీనవర్గాల భూములను లాక్కొంటున్నారని, అగ్రవర్ణాల వారి భూములను అలాగే ఉంచుతున్నారని ఆరోపించారు.
చదవండి: సాగరహారంపై ‘పిట్ట పోరు’.. కేటీఆర్‌–రేవంత్‌ల మాటల యుద్ధం

మరిన్ని వార్తలు