మీడియా కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్ నేతల రచ్చ

23 Sep, 2023 09:21 IST|Sakshi

తిరువనంతపురం: కేరళలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనే బహిరంగంగా వాగ్వాదానికి దిగారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సుధాకరన్, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీషన్‌లు మైక్ ముందే నువ్వా-నేనా అన్నట్లు తగువులాడుకున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగాన్ని ముందు ఎవరు ప్రారంభించాలనే అంశం ఇద్దరి మధ్య వాగ్వాదానికి కారణమైనట్లు తెలుస్తోంది.

పుత్తుపల్లి ఉప ఎన్నికల్లో చాందీ ఊమెన్ అఖండ విజయం సాధించిన తర్వాత సెప్టెంబర్ 8న కొట్టాయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. సతీషన్, సుధారకరన్ పక్కపక్కనే కూర్చున్నారు.  ఈ క్రమంలో ముందు ఉన్న మైక్‌లను సుధాకరన్ తనవైపుకు తిప్పుకున్నారు. దీంతో ముందు మీరెలా ప్రసంగం ప్రారంభిస్తారని సతీషన్ ప్రశ్నించారు. దీంతో వివాదం రచ్చకెక్కింది. తాను పార్టీ ప్రెసిడెంట్‌ను అని తెలిపిన సుధాకరన్.. తనకు ఆ హక్కు ఉంటుందని మైక్ ముందే అన్నారు. ఎట్టకేలకు సతీషన్ తగ్గగా.. మైకులను సుధాకరన్ వైపుకు ఉంచారు. 

ప్రెస్ మీటింగ్‌లో అడిగిన ప్రశ్నలకు అధ్యక్షుడు ఇప్పటికే చెప్పారుగా.. అంటూ సతీషన్ దాటవేశారు. మీడియా ప్రతినిధులు ఇంగ్లీష్‌లో అడిగిన ప్రశ్నలకు సధాకరన్‌కు సతీషన్ సహాయం చేయడానికి కూడా నిరాకరించారు. ఇద్దరి మధ్య వాగ్వాదానికి సంబంధించిన అంశంపై సతీషన్‌ను ప్రశ్నించగా.. తమ మధ్య వేరే విషయం ఉందని అన్నారు. పుత్తుపల్లి గెలుపు క్రెడిట్‌ మొత్తం తనకే కేటాయిస్తానని అనడంతో నేను ఆపే ప్రయత్నం చేశానని సతీషన్‌ చెప్పుకొచ్చారు.  

ఇదీ చదవండి: Jamili Elections: జమిలి ఎన్నికల ఉన్నతస్థాయి కమిటీ తొలి భేటీ

మరిన్ని వార్తలు