‘కొండలు, చెరువులన్నీ దోచుకున్నాడు.. నా స్పీడ్‌కు బ్రేక్ వేయడం ఎవరితరం కాదు’

24 May, 2022 02:20 IST|Sakshi

టికెట్‌ ఇప్పిస్తానని గిరిజన బిడ్డను రోడ్డున పడేసింది

రేణుకాచౌదరిని ఉద్దేశించి మంత్రి పువ్వాడ విమర్శలు 

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అధికారంలో ఉన్నప్పుడు పేదలకు సాయం చేయలేనివారు, ఇరవై ఏళ్ల పాటు పదవులు అనుభవించి స్వలాభం చూసుకున్నవారు.. ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌గా నిలుస్తున్న తన ను విమర్శించడం గర్హనీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. రూ.1.81 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను 181 మంది లబ్ధిదారులకు సోమవా రం ఇక్కడ మంత్రి పంపిణీ చేశారు.

అనంతరం మాట్లాడుతూ ఓ నాయకురాలు పార్టీ టికెట్‌ ఇప్పిస్తానని చెప్పి గోల్‌మాల్‌ చేసి ఓ గిరిజన డాక్టర్‌ బతుకును ఆగం చేసి, రోడ్డుమీద పడే పరిస్థితి తీసుకొచ్చారని కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పదిహేనేళ్లు దాటిన వాహనాలను తుక్కు కింద లెక్కకట్టాలని రవాణా శాఖలో ఓ చట్టం ఉందని, అలాగే రాజకీయాల్లో కూడా స్క్రాప్‌ పాలసీ తీసుకురావాలని అన్నారు. ఖమ్మం జిల్లా, నగరాభివృద్ధికి చేసిందేమీ లేకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు డ్రామాలు చేస్తూ, గాజులేసుకుని.. పెద్ద కళ్లజోళ్లు పెట్టుకుని డ్యాన్స్‌ వేసుకుంటూ ప్రదర్శనలు చేస్తారని ఎద్దేవా చేశారు.  

చదవండి: Harish Rao: లంచం అడిగిన వైద్యుడు.. మంత్రి రియాక్షన్‌ ఇది

మరిన్ని వార్తలు