రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోదీని లేకుండా చేయాలి.. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

12 Dec, 2022 14:57 IST|Sakshi

భోపాల్‌: కాంగ్రెస్ నేత రాజా పటేరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ మద్దతుదారులతో ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాజ్యాంగాన్ని కాపాడాలంటే ప్రధాని నరేంద్ర మోదీని లేకుండా చేయాలని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపింది.

దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ మహాత్మా గాంధీకి చెందిన పార్టీ కాదని, ఇటలీ ముస్సోలిని పార్టీ అని తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆ పార్టీ ఆయన సిద్ధాంతాలనే పాటిస్తోందని మధ్యప్రదేశ్ కమలం పార్టీ నేత నరోత్తమ్ మిశ్రా ధ్వజమెత్తారు. 

అయితే తన ‍వ్యాఖ్యలపై రాజా పటేరియా వివరణ ఇచ్చారు. మోదీని లేకుండా  చేయాలనేది తన ఉద్దేశం కాదని, ఎన్నికల్లో ఓడించాలనేదే తన మాటల్లోని అంతరార్థం అని చెప్పుకొచ్చారు. వీడియో తీసిన వ్యక్తి ఎవరో తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని పేర్కొన్నారు. మోదీని లేకుండా చేయడమంటే, అధికారం నుంచి గద్దె దించడమేనని వివరించారు.

మధ్యప్రదేశ్ మాజీ మంత్రి అయిన రాజా పటేరియా సోమవారం తన మద్దతుదారులతో మాట్లాడుతూ మోదీపై ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొద్ది గంటలకే ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో ఆయన వివరణ ఇచ్చారు.

చదవండి: రొటీన్‌కు భిన్నంగా ఆలోచించండి.. ఇంకెన్నాళ్లు ఇలా?

మరిన్ని వార్తలు