‘ప్రజల కష్టాన్ని ఒకే చోట పెడితే.. అలాంటి పరిస్థితే వస్తుంది’

5 Oct, 2022 17:16 IST|Sakshi

మాజీ మంత్రి కొడాలి నాని

సాక్షి, కృష్ణా జిల్లా: అమరావతి ఉద్యమాన్ని దేవుళ్లు, ప్రజలు హర్షించరని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడ్లవల్లేరు మండలం వేమవరం కొండాలమ్మ దేవస్థానంలో జరిగిన దసరా ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. వికేంద్రీకరణ కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చదవండి: ఆలయానికి వచ్చి రాజకీయాలా?.. చంద్రబాబుపై మంత్రి ఫైర్‌

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు వెనుకబడి ఉన్నారని కొడాలి నాని అన్నారు. రాష్ట్ర సంపదంతా ఒకే చోట పెడితే ప్రాంతీయ విద్వేషాలు వస్తాయన్నారు. హైదరాబాద్‌ను కోల్పోయి అనాధలయ్యాం. ప్రజల కష్టాన్ని ఒకే చోట పెడితే హైదరాబాద్‌ పరిస్థితే వస్తుంది. కులాలు, పార్టీల కోసం కాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేయకూడదనే సీఎం జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని’’ కొడాలి నాని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు