దమ్ముంటే గుడివాడలో నాపై పోటీచెయ్యి

8 Mar, 2021 03:14 IST|Sakshi

చంద్రబాబుకు మంత్రి కొడాలి సవాల్‌

సాక్షి, అమరావతి: ‘నీకు దమ్ము, ధైర్యం ఉంటే.. నువ్వు మగాడివే అయితే.. గుడివాడలో నా మీద పోటీ చెయ్‌’ అని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చంద్రబాబును సవాల్‌ చేశారు. తాను పేకాట క్లబ్లులు నడుపుతున్నానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రగిరిలో 1978 ప్రాంతంలో వ్యభిచార గృహాలు నడిపిన చరిత్ర ఆయనదేనన్నారు. నోరుందని అడ్డగోలుగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ తెచ్చిన లక్ష కోట్ల అప్పులో సంక్షేమ పథకాలకే రూ.90 వేల కోట్లు ఖర్చు పెట్టారని, చంద్రబాబు రూ.3.60 లక్షల కోట్ల అప్పు తెచ్చి దోచుకున్నారే తప్ప జనానికి ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. కొడాలి నాని ఇంకేమన్నారంటే..

దొంగలంతా నీ పక్కే ఉన్నారు
‘మా మంత్రి వెలంపల్లిని కొబ్బరి చిప్పల మంత్రి అంటావా? కొబ్బరి చిప్పలమ్ముకునే వాళ్లు, సైకిల్‌ బెల్లులు దొంగతనం చేసిన వాళ్లు నీ వెంటే ఉన్నారు చంద్రబాబూ. దుర్గగుడిలో నీ కుటుంబం క్షుద్ర పూజలు చేసింది కాబట్టే అమ్మవారు నీకు దిక్కులేని పరిస్థితి కల్పించింది. కృష్ణా పుష్కరాల పేరుతో రూ.3 వేల కోట్లు మింగేశావ్‌. విజయవాడ ప్రజలకు పౌరుషం లేదా అంటావా? పౌరుషం ఉంది కాబట్టే మోసం చేసిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరలు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై దమ్ముంటే ప్రధాని మోదీని నిలదీయాలి. జగన్‌ ఓటుకు రూ.2 వేలు ఇస్తాడని తప్పుడు మాటలు మాట్లాడుతున్నావ్‌. ఓటుకు రూ.5 కోట్లు డీల్‌ కుదుర్చుకున్న దొంగవు నువ్వు.  చంద్రబాబూ.. నీ సంగతి నీ మనవడికి కూడా తెలిసిపోయింది. అందుకే ‘ఏబీసీడీ ఎఫ్‌.. తాత పని టఫ్‌’ అని పాటపాడుకుంటున్నాడు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించం. ’ అని నాని మండిపడ్డారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు