ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చేశారు?

30 Mar, 2023 20:05 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఎన్టీఆర్‌ను చంద్రబాబు మానసిక క్షోభకు గురి చేశాడని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన సాక్షితో మాట్లాడుతూ, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చనిపోయాక పొగడటం మొదలు పెట్టాడని, చంద్రబాబు చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు

‘‘చంద్రబాబు హయాంలో పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు?. ఎన్టీఆర్‌కు కొన్ని సిద్ధాంతాలు ఉండేవి.. చంద్రబాబు ఓ 420. రెండెకరాల చంద్రబాబు వేల కోట్లు ఎలా సంపాదించారు?. ఎన్టీఆర్‌ కాళ్లు పట్టుకుని చంద్రబాబు టీడీపీలో చేరాడు. ఎన్టీఆర్‌కు పిల్లలన్నా, కుటుంబమన్నా విపరీతమైన అభిమానం. ప్రజలకు సేవ చేయాలని వచ్చిన మహా పురుషుడు ఎన్టీఆర్‌. చంద్రబాబు తిన్నింటి వాసాలు లెక్కపెడతాడని ఎన్టీఆర్‌ ఆనాడే చెప్పారు. ఎన్టీఆర్‌ బతికుండగానే సీఎం పదవి నుంచి చంద్రబాబు తప్పించారు. ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చేశారు?’’ అని కొడాలి నాని ప్రశ్నించారు.
చదవండి: బాబు ఏం చెప్పారు?.. జ్యోతుల నెహ్రూ ఎందుకు రగిలిపోతున్నారు?

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు లాక్కున్నాడు. ఎన్టీఆర్‌ రక్తం పంచుకుని పుట్టామని చెప్తున్న వాళ్లు సిగ్గులేకుండా చంద్రబాబు వెనకాల తిరుగుతున్నారు. ఎన్టీఆర్‌లా పౌరుషం ఉన్న నాయకుడు హరికృష్ణ మాత్రమే. చంద్రబాబు కనుసన్నల్లోనే అమరావతి యాత్ర జరిగింది. చంద్రబాబుకు ఉన్నంత స్వార్థం ఎవరికీ లేదు. ఇప్పుడు ఎన్టీఆర్‌ పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ఎన్టీఆర్‌ తర్వాత సొంతంగా పార్టీ పెట్టి సీఎం అయ్యింది జగన్‌ ఒక్కరే. ఎన్టీఆర్‌ పార్టీ కొట్టేసిన చంద్రబాబే పెద్ద సైకో’’ అంటూ కొడాలి నాని దుయ్యబట్టారు.
 

మరిన్ని వార్తలు