చంద్రబాబు ఫోన్‌ కాల్స్‌పై సీబీఐ విచారణ జరగాలి: కొడాలి నాని

4 Feb, 2023 15:05 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: పాదయాత్ర చేయడం కంటే ప్రశాంతంగా పడుకోవడమే లోకేష్‌కు ఇష్టమంటూ మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం జగన్‌పై లోకేష్‌ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలవలేని దద్దమ్మ లోకేష్‌కు మాట్లాడటం రాదు. లోకేష్‌ నడిచేది రోజూ 10 కిలోమీటర్లు కూడా లేదు’’ అని కొడాలి దుయ్యబట్టారు.

‘‘చంద్రబాబు పాదయాత్ర చేయలేక తన కొడుకును పంపాడు. జనం లేక లోకేష్‌ ఖాళీ కుర్చీలకు స్పీచ్‌లు ఇస్తున్నాడు. నిబంధనలు పాటించమంటే పోలీసులను తిడుతున్నాడు. నారావారి పల్లె నుంచి వలస వెళ్లిపోయింది చంద్రబాబే. దత్తపుత్రుడు కూడా హైదరాబాద్‌కు వలస వెళ్లిపోయాడు. లోకేష్‌ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. పనికిమాలిన ముసలి సైకో చంద్రబాబు. నీ అయ్య దెబ్బకు నీ బాబాయ్‌ ఏమయ్యాడో తెలియడం లేదు. పండగకు నారావారిపల్లెలో నీ బాబాయ్‌ ఎందుకు కనపడడు?. ముందు నీ బాబాయ్‌ చూపించు’ అంటూ లోకేష్‌ను కొడాలి నాని నిలదీశారు.

‘‘సీఎం జగన్‌తో మాట్లాడాలంటే అక్కడి సిబ్బందికే ఫోన్‌ చేయాలి. నవీన్‌కు అవినాష్‌రెడ్డి ఫోన్‌ చేశారంటూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వివేకా హత్య జరిగినప్పుడు సీఎంగా చంద్రబాబే ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు, కడప జిల్లా నేతలు పోలీసులతో ఏం మాట్లాడారు. చంద్రబాబు ఫోన్‌ కాల్స్‌పై సీబీఐ విచారణ జరపాలి. అప్పటి డీజీపీ, టీడీపీ నేతల ఫోన్‌ కాల్స్‌పై విచారణ జరగాలి’’ అని మాజీ మంత్రి డిమాండ్‌ చేశారు.

కడపలో జిల్లాలో గంటా శ్రీనివాస్‌ను ఇన్‌ఛార్జ్‌గా పెట్టి వివేకా ఓటమికి కారణమయ్యారు. ఎన్నికల ముందు వివేకాను చంపి కేసును సీఎం జగన్‌పై పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. జగన్‌ ఒంటరిగా పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచారు. వివేకాను అక్కున చేర్చుకున్న హృదయం సీఎం జగన్‌ది అని ఆయన అన్నారు.
చదవండి: కోటంరెడ్డికి మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్‌

‘‘ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం పదవి లాక్కున్న వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్‌ వారసులు పార్టీలోకి వస్తుంటే ఎందుకు వారి గుండెపోట్లు వస్తున్నాయి. హరికృష్ణ డిమాండ్‌ చేసినా ఎన్టీఆర్‌ మృతిపై ఎందుకు విచారణ చేయలేదు?. ఎన్టీఆర్‌ చనిపోతే ఎందుకు పోస్ట్‌మార్టం చేయించలేదు. ఎన్టీఆర్‌ మరణం వెనుక గుట్టు తేల్చాలి. దీనిపై ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తా’’ అని కొడాలి నాని పేర్కొన్నారు.


 

మరిన్ని వార్తలు