చంద్రబాబు 420.. లోకేశ్‌ 210 

9 Sep, 2022 05:14 IST|Sakshi

గుడివాడ రూరల్‌ : సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే 420 చంద్రబాబు, 210 లోకేశ్‌ల తాట తీస్తామని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు. చంద్రబాబుది మహిళలను అడ్డం పెట్టుకుని బతికే నీచపు బతుకని, అడ్రస్‌ లేని వ్యక్తి చంద్రబాబు అని, ఆయన నారా భువనేశ్వరి భర్తగా, ఎన్టీఆర్‌ అల్లుడిగానే ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు.  కృష్ణా జిల్లా గుడివాడలో గురువారం  మీడియాతో మాట్లాడారు. దమ్ము, ధైర్యం ఉంటే తుప్పు చంద్రబాబు, పప్పు లోకే శ్‌లు తనపైకి రావాలని, మహిళలను అడ్డుపెట్టుకుని దిగజారుడు రాజకీయాలొద్దని హెచ్చరించారు. 

అడ్రస్‌ లేని బతుకులు.. 
నాడు లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టి ఎన్టీర్‌కు బాబు వెన్నుపోటు పొడిచాడని నాని ధ్వజమెత్తారు. భార్యను అడ్డు పెట్టుకుని ఎన్టీఆర్‌ అల్లుడిగా రాజకీయాల్లో ఎదిగి, చివరకు పప్పు లోకేశ్‌కు పేరు రావడానికి ఎన్టీఆర్‌ మనుమరాలితో పెళ్లి చేశాడన్నారు. వీళ్లవి సొంతంగా అడ్రస్‌ లేని బతుకులని, ఆడవాళ్లను అడ్డు పెట్టుకునే రాజకీయాల్లో ఎదిగారని ఎద్దేవా చేశారు. సీఎంను మార్చాలంటూ లోకేశ్‌ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రిని మార్చేది రాష్ట్ర ప్రజలనే విషయం తెలియని లోకేశ్‌కి ఉన్న  రాజకీయ పరిజ్ఞానమేంటో ఇట్టే అర్థమవుతోందన్నారు.  

వార్డు మెంబర్‌గా గెలవని లోకేశ్‌కు చంద్రబాబు మంత్రిని చేసినా  పప్పు పప్పేనన్నారు. ముఖ్యమంత్రి సతీమణి భారతమ్మపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. చంద్రబాబు, అతని తండ్రి ఖర్జూరనాయుడి చరిత్ర అందరికీ తెలుసునన్నారు. శనక్కాయలు దొంగతనం చేసిన చరిత్ర చంద్రబాబు తండ్రిదని, రైల్వేస్టేషన్‌లో జేబులు కొట్టేసిన ఘనత చంద్రబాబుదని, ఇలాంటి నీచ చరిత్ర ఉన్న చంద్రబాబు కుటుంబ సభ్యులకు సీఎం జగన్‌ కుటుంబాన్ని విమర్శించే స్థాయి లేదన్నారు. బాబు, కొడుకులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు