లోకేశ్‌ హైడ్రామా.. పథకాలు పక్కదోవ పట్టించడానికే

18 Aug, 2021 03:40 IST|Sakshi

ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి సీఎంకు సవాల్‌ విసరడమేంటి?

మంత్రి కొడాలి నాని ఫైర్‌

సాక్షి, అమరావతి: విద్యారంగంలో సీఎం వైఎస్‌ జగన్‌ అనేక సంస్కరణలు చేపట్టారని.. విద్యార్థుల కోసం అనేక పథకాలను అమలుచేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్‌ వద్ద మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పథకాలను పక్కదోవ పట్టించడానికే చంద్రబాబు ఓ వైపు.. ఆయన కుమారుడు లోకేశ్‌ మరోవైపు  రోజుకో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.

అందులో భాగంగానే  తనయుడ్ని గుంటూరు పంపి హైడ్రామా చేయించాడని కొడాలి మండిపడ్డారు. దళిత విద్యార్థిని చనిపోతే లోకేశ్‌ శవ రాజకీయాలు చేశాడని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి సీఎంకు సవాల్‌ విసరడమేంటని మంత్రి లోకేశ్‌ని ఎద్దేవా చేశారు. ఘటన జరిగిన 12 గంటల్లో నిందితుడిని పట్టుకున్నారని, దిశా చట్టం తెచ్చి ముఖ్యమంత్రి జగన్‌ మహిళలకు రక్షణ కల్పిస్తున్నారని ఆయన చెప్పారు.  

మరిన్ని వార్తలు