లోకేష్‌ ఎక్కడ తిరిగినా ఉపయోగం లేదు..

30 Oct, 2020 14:51 IST|Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీ నేత నారా లోకేష్‌పై పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘లోకేష్‌ లాంటి వేస్ట్‌ మనిషిని మేం ఎక్కడా చూడలేదు. వరి చేనుకు, చేపల చెరువుకు తేడా తెలియని వ్యక్తి. లోకేష్‌ ఎక్కడ తిరిగినా ఉపయోగం లేదు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే లోకేష్‌కు తగిన బుద్ధి చెబుతాం. (‘వరి చేనుకు చేపల చెరువుకు తేడా తెలియని మేధావి’)

కరెంట్‌ ఛార్జీలు తగ్గించమని అడిగితే బషీర్‌ బాగ్‌ వద్ద రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుది. ఇప్పుడు రైతులకు సంకెళ్లు వేశారని దేవినేని ఉమా సంకెళ్ల నాటకం ఆడుతున్నారు. అప్పుడు బషీగ్‌ బాగ్‌ ఘటన సమయంలో ఉమా గన్‌తో ఎందుకు కాల్చుకోలేదు. గుంటూరులో జరిగిన ఘటనలో రైతులు పోలీస్ సిబ్బంది మీద తిరగబడితే  సంకెళ్లు వేశామని చెప్పారు. వారిపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. అమరావతిలో మాత్రమే రైతులున్నట్లు బాబు వ్యవహరిస్తున్నారు. అమరావతిలో కొన్న భూముల ధరలు పడిపోయాయని రైతులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు బృందం రాద్దాంతం చేస్తోంది’ అని అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు