రామోజీ లాంటి వాళ్లను ఆనాడు ఎన్టీఆర్‌ పట్టించుకోలేదు: కొడాలి నాని

23 Feb, 2023 16:03 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ, ఈనాడు రామోజీరావుపై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తప్పుడు వార్తలతో ఈనాడును దిగజార్చుకున్న వ్యక్తి రామోజీరావు. తాను ఏది చెబితే అది ప్రజలు నమ్ముతారని రామోజీరావు అనుకుంటున్నారు. రామోజీలాంటి వాళ్లను ఆనాడు ఎన్టీఆర్‌ పట్టించుకోలేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

కాగా, కొడాలి నాని శుక్రవారం మీడియాతో​ మాట్లాడుతూ.. ‘చంద్రబాబును సీఎం చేయాలన్నదే రామోజీరావు లక్ష్యం. అందుకే రామోజీ అసత్య కథనాలు, అభూత కల్పనలు చేశారు. పట్టాభి పాత ఫొటోలతో రామోజీ సిగ్గులేని రాతలు రాశారు. రామోజీ లాంటి వాళ్లను ఆనాడు ఎన్టీఆర్‌ పట్టించుకోలేదు. అందుకే ఆనాడు ఎన్టీఆర్‌ మీద పేజీల మీద పేజీలు రాశారు. ఎన్టీఆర్‌ తెచ్చిన మద్యపాన నిషేధాన్ని ఎత్తివేయించిన ఘనుడు రామోజీరావు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి ఎన్టీఆర్‌పై తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు గన్నవరం ఘటనకు సంబంధి తప్పుడు వార్తలు రాసినట్టే అప్పుడు ఎన్టీఆర్‌పై పేజీల మీద పేజీలు వ్యతిరేక వార్తలు రాశారు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. 

ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ఎల్లో మీడియాకు కనిపించట్లేదు. తప్పుడు వార్తలతో ఈనాడును దిగజార్చుకున్న వ్యక్తి రామోజీరావు. చంద్రబాబు, రామోజీ కుట్ర మేరకే ఈనాడులో దుష్ప్రచారం. అసత్యాలను సత్యాలుగా నమ్మించాలనేదే రామోజీ కుట్ర. ఈనాడు తప్పుడు వార్తలపై కనీకనిపించని రీతిలో సవరణ వేశారు. టీడీపీ హయంలో దుష్టచతుష్టం కలిసి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. తప్పుడు ఫొటోలు ప్రచురించి పత్రికా విలువను రామోజీ దిగజార్చారు. ఈనాడు తప్పుడు వార్తలపై రామోజీ క్షమాపణ చెప్పాలి. లేకుంటే మీ కుట్రలు, కుతంత్రాలను ప్రజల ముందు పెడతాం. మళ్లీ రాష్ట్రాన్ని దోచుకోవడానికే కుట్రలు పన్నుతున్నారు. రెండేళ్ల కిందటి ఫొటోలు ప్రచురించి సాంకేతిక సమస్య అని చెబుతున్నారు. రామోజీ పిచ్చిరాతలను చూస్తూ ఊరుకునేది లేదు. ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకుని రామోజీ వార్తలు రాయాలి. ఇప్పటికైనా రామోజీ బుద్ధి తెచ్చుకుని సరైన ఖండన ఇవ్వాలి. 

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధిక భాగం కేటాయించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సామాజిక విప్లవానికి తెరతీశారు. ఎన్టీఆర్‌, మహానేత వైఎస్సార్‌ తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చింది సీఎం జగనే. అందుకే చంద్రబాబు, ఎల్లో మీడియా కుట్రకు తెరలేపారు. పట్టాభిని గన్నవరం ఎవరు పంపించారు. గన్నవరంలో పట్టాభి రెచ్చగొట్టేలా మాట్లాడి డ్రామా చేశాడు. కర్రలు, రాళ్లతో దాడి చేసి సీఐ తల పగులగొట్టారు. పథకం ప్రకారం దాడి చేసి సీఐని కొడితే కేసు పెట్టరా?. సీఐ తలకు కుట్లు పడి ఐసీయూలో ఉన్నారు. పోలీసులకు కులమతాలు అంటగట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. బీసీలపై ప్రేమ ఉన్నట్టు చంద్రబాబు డ్రామాలడుతున్నారు. గన్నవరంలో గాయపడిన గురుమూర్తిని చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదు అంటూ ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు