‘లేదంటే నా దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్‌ విడుదల చేస్తా’

22 Jan, 2022 16:12 IST|Sakshi

విజయవాడ: తన కె కన్వెన్షన్‌లో  ఎలాంటి కాసినో జరగలేదని మంత్రి కొడాలి నాని మరోసారి తేల్చిచెప్పారు.  పక్క ప్లాన్‌ ప్రకారం ఇలాంటి ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. శనివారం సాక్షి న్యూస్‌తో మాట్లాడిన కొడాలి.. చంద్రబాబు బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు పెట్టింది పేరని విమర్శించారు. 

‘నాపై ఆరోపణలు చేస్తే భయపడతానని అనుకుంటున్నాడు. కాసినో జరగలేదని ఆధారాలు ఉన్నప్పుడు నిజనిర్థారణ కమిటీ ఎందుకు?, టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు నిరూపించాలి. లేదంటే నా దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్‌ విడుదల చేస్తా. కాసినో పెట్టినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా. టీడీపీ హయాంలో నియోజకవర్గానికో క్లబ్‌ నడిపిన చరిత్ర చంద్రబాబుది.  రాష్ట్రంలో క్లబ్‌లన్నీ మూసేసిన చరిత్ర జగన్‌ ప్రభుత్వానిది’ అని కొడాలి తెలిపారు. 

‘కాసినో’ వ్యవహారం నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. లేకుంటే మీరేం చేస్తారు?: మంత్రి కొడాలి నాని

మరిన్ని వార్తలు