టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక.. అక్కడ తట్టెడు మట్టి కూడా తీయలేదు

27 Sep, 2022 08:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొడంగల్‌లో తాను ఎమ్మెల్యేగా ఉన్న తొమ్మిదేళ్ల కాలంలోనే అభివృద్ధి జరిగిందని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక అక్కడ తట్టెడు మట్టి కూడా తీయలేదని మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని మారుమూల గ్రామాల్లోని ప్రజలు కూడా చెబుతారన్నారు. సోమవారం నియోజకవర్గంలోని మద్దూరు, గోకుల్‌నగర్, సీతానాయక్‌ తండాల నుంచి టీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన యువకులు కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని తన పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయంలో వారికి రేవంత్‌ కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.
చదవండి: ప్రాజెక్టులకు సహకరించని రాష్ట్ర సర్కారు

మరిన్ని వార్తలు