టీడీపీలో ముసలం.. కోడెల కుమారుడు శివరాం సంచలన వ్యాఖ్యలు

1 Jun, 2023 21:13 IST|Sakshi

సాక్షి, పల్నాడు జిల్లా: సత్తెనపల్లి టీడీపీలో ముసలం పుట్టింది. నియోజకవర్గ ఇంచార్ద్ నియామకం టీడీపీలో కాక రేపుతోంది. అనుచరులతో కోడెల కుమారుడు శివరాం సమావేశమయ్యారు. టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా కన్నా లక్ష్మీనారాయణ నియామకాన్ని వ్యతిరేకిస్తున్న కోడెల శివరాం.. పట్టణంలో గురువారం ర్యాలీ నిర్వహించారు.

ఇన్‌ఛార్జ్‌గా కన్నా పేరు ప్రకటనపై తమకు సమాచారం లేదని కోడెల శివరాం మండిపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో కన్నా అరాచకాలను కోడెల అడ్డుకున్నారని, టీడీపీని అవమానించిన నాయకులకు పెద్దపీట వేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు.

‘‘లాలుచి రాజకీయాలు మాకు తెలియదు. తెలుగుదేశం పార్టీని కోడెల బతికించారు. కొంత మంది నాయకులు మాపై కుట్రలు చేస్తున్నారు. టీడీపీ అధిష్టానం మమ్మల్ని  పట్టించుకోవటం లేదు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అధిష్టానం సత్తెనపల్లిని టార్గెట్ చేసింది’’ అంటూ శివరాం  ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి:  టీడీపీకి షాకిచ్చిన కొట్టే వెంకట్రావు దంపతులు

మరిన్ని వార్తలు