కోమరంభీం జిల్లాలో టీఆర్‌ఎస్‌కు షాకిచ్చిన నేతలు... లేఖలో ఆవేదన

16 Aug, 2022 19:58 IST|Sakshi

సాక్షి, కొమరంభీం జిల్లా: కోమరంభీం జిల్లాలోని బెజ్జూర్‌ మండలంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. మండలంలోని పలు అభివృద్ధి పనులు జరగడం లేదని పలువురు ప్రజా ప్రతినిధులు టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఇచ్చిన హమీలు నేరవేయడం లేదని ముగ్గురు సర్పంచ్‌లు, జడ్పీటీసీ పుష్పలత, ఎంపీటీసీతో పాటు కాగజ్‌నగర్‌ మార్కెట్ కమిటీ డైరెక్టర్, బెజ్జూర్‌ సహాకర సంఘం డైరెక్టర్ రాజీనామా చేశారు. ఏళ్లుగా ఉన్న సమస్యలు  పరిష్కరించకపోడవం వల్లే  రాజీనామా చేశామని సదరు ప్రజా ప్రతినిధులు తెలిపారు. ఈమేరకు టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడికి  లేఖ రాశారు.

మరిన్ని వార్తలు