నా జోలికొస్తే నీ చరిత్ర మొత్తం బయటపెడతాను.. ఒళ్ళు దగ్గర పెట్టుకో: రేవంత్‌కు రాజగోపాల్‌ వార్నింగ్‌

4 Sep, 2022 20:27 IST|Sakshi

సాక్షి, నల్గొండ : తెలంగాణలో పొలిటికల్‌ లీడర్ల మధ్య మాటల వార్‌ నడుస్తోంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాటల దాడి చేస్తున్నారు. హస్తం నేతలను టార్గెట్‌ చేస్తూ విమర్శలకు దిగుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా రేవంత్‌ రెడ్డిపై రాజగోపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కోమటిరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పెద్ద బ్లాక్ మెయిలర్. నా జోలికొస్తే నీ చరిత్ర మొత్తం బయట పెడతాను. నీకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో అన్ని తెలుసు. వాటిని బయట పెడితే ముఖం చూపించుకోలేవు. పోయేకాలం వచ్చిందా రేవంత్? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నోరు అదుపులో పెట్టుకోకపోతే మునుగోడులో కూడా అడుగు పెట్టవ్.

సమాచార హక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్లు వెనకేసుకున్నది నువ్వు కాదా?. హైదరాబాద్‌లో వంద మందిని‌ బ్లాక్ మెయిల్‌ చేసి ఒక్కొక్కరి దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేశావు. డబ్బులిచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నావు. నీలాంటి మనిషిని పీసీసీ చేయడమా?.  నీది నేర, అవినీతి చరిత్ర నీకు పార్టీ జెండా కావాలి. నేను ఇండిపెండెంట్‌గా పోటీచేసినా గెలుస్తాను. మునుగోడుకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతున్నావు. పోనీలే అని ఇరవై రోజులుగా ఓపిక‌పడుతున్నా. నా మంచితనాన్ని చేతగానితనంగా అనుకోవద్దు. నేను అమ్ముడుపోయినట్లు నీ దగ్గర పత్రాలు ఉంటే మీడియాకు ఇవ్వు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక సోషల్ మీడియాలో పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావు. నీకు లాస్ట్ వార్నింగ్ అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ ఎగ్జామ్‌లో గోల్‌మాల్‌.. గోవాలో సీక్రెట్‌గా పరీక్షలు!

మరిన్ని వార్తలు