బయటకు చెప్పకూడని విషయాలు మాట్లాడా.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు..

22 Dec, 2022 07:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో గత 20 నెలలుగా జరుగుతున్న పరిణామాలను దిగ్విజయ్‌ కు వివరించినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి దిగ్విజయ్‌ బస చేసిన హోటల్‌కు వెళ్లి భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఏ పరిస్థితుల్లో ఉందో దిగ్విజయ్‌కు చెప్పానన్నారు. అన్ని విషయాలూ మాట్లాడుకున్నామని, అందులో బయటకు చెప్పలేని విషయాలు కూడా ఉన్నాయన్నారు. పార్టీ అభివృద్ధి కోసం కొన్ని సలహాలు ఇచ్చానని తెలిపారు. తాను గురువారం గాం«దీభవన్‌కు రాలేని పరిస్థితి కారణంగానే ముందే కలిశానని చెప్పారు.  

హోటల్లో రాజకీయాలు మాట్లాడను
రాజకీయాలు హోటల్లో మాట్లాడేవి కావని, పార్టీ ఆఫీస్‌లో వాటి గురించి మాట్లాడతానని దిగ్విజయ్‌ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. పార్టీలో వర్గాలు లేవని, అందరూ కాంగ్రెస్‌ సభ్యులేనని చెప్పారు.
చదవండి: సర్దుకుపోదాం రండి!.. టీపీసీసీ నేతలతో దిగ్విజయ్‌ భేటీ

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు