చంద్రబాబు, లోకేష్‌లకు సిగ్గుండాలి

17 Mar, 2022 04:14 IST|Sakshi

ప్రభుత్వ విప్‌ కొరముట్ల విమర్శ

సాక్షి, అమరావతి: జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న సహజ మరణాలను ఆసరాగా చేసుకుని శవ రాజకీయం చేస్తున్న చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేష్‌కు సిగ్గుండాలని ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద బుధవారం ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే.. ‘ ఈ మరణాలపై ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి క్లియర్‌గా స్టేట్‌మెంట్లు ఇచ్చినప్పటికీ జ్యుడిషియల్‌ ఎంక్వైరీ అడగడానికి నోరెలా వచ్చింది.

రూ.రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్‌ పెడితే  దానిపై చర్చించకుండా, ప్రశ్నోత్తరాలను జరగనివ్వకుండా ప్లకార్డులు తీసుకువచ్చి పథకం ప్రకారం  టీడీపీ సభ్యులు పదేపదే సభను అడ్డుకుంటున్నారు. జంగారెడ్డిగూడెంలో చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులేమో తమ తండ్రికి మద్యం అలవాటు లేదంటుంటే.. టీడీపీ శవ రాజకీయం చేస్తోంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇటీవల సభలో ఏదేదో మాట్లాడారు’ అని విమర్శించారు. 

మరిన్ని వార్తలు