ఆ మాటలను మీడియా ఆపాదించింది

1 Oct, 2020 05:35 IST|Sakshi

 గ్రేటర్‌ ఎన్నికలపై కేటీఆర్‌ వివరణ  

సాక్షి, హైదరాబాద్‌: ‘నవంబర్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలుంటాయని నేను అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. జీహెచ్‌ఎంసీ యాక్టు ప్రకారం నవంబర్‌ రెండోవారం తర్వాత ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, కనుక పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని మాత్రమే నేను అనడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్, నిర్వహణ పూర్తిగా ఎన్నికల కమిషన్‌ పరిధిలోని అంశం.

సదరు మీడియా సంస్థలు నేను అనని మాటలను నాకు ఆపాదించడం జరిగింది’అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు బుధవారం ట్వీట్‌ చేశారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో బల్దియా ఎన్నికలపై కేటీఆర్‌ సంకేతాలిచ్చినట్టు పత్రికల్లో వార్తలు రావడంతో ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు.    

మరిన్ని వార్తలు