ప్రతిపక్షాలు విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి..

22 Nov, 2020 18:35 IST|Sakshi

బీజేపీ నేతల వల్లే వరద సాయం ఆగిపోయింది..

రోడ్ ‌షోలో మంత్రి కేటీఆర్

సాక్షి, హైదరాబాద్‌: విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు (కేటీఆర్‌) మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల్లో ఆదివారం నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన పాల్గొన్నారు. జహీరానగర్‌ చౌరస్తాలో కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతోనే గత ఎన్నికల్లో 99 సీట్లు గెలిచామని, టీఆర్‌ఎస్ పాలనలో బస్తీలు అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మంచినీటి సమస్యను పరిష్కరించామని తెలిపారు. (చదవండి: ‘వరద సాయాన్ని వారే మింగేశారు..!’

కేంద్రంపై ఛార్జ్‌షీట్లు వేయాల్సి వస్తే.. బీజేపీపై 132 కోట్ల ఛార్జ్‌షీట్లు వేయాలని కేటీఆర్‌ అన్నారు. ‘‘ఓట్ల కోసం ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. తెలంగాణలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలవుతున్నాయా?. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారు. బీజేపీ నేతల వల్లే వరద సాయం ఆగిపోయింది. అర్హులందరికీ వరద సాయం అందిస్తాం. జీహెచ్‌ఎంసీలో 100 సీట్లు గెలిచి ప్రతిపక్షాలకు బుద్దిచెప్పాలని’’ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. (చదవండి: ‘రెండు నెలల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చేయగలం’)

మరిన్ని వార్తలు