ఎమ్మెల్సీ ఎన్నికలు: పార్టీ నేతలకు కేటీఆర్‌ వార్నింగ్‌

27 Feb, 2021 20:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్ని ప్రచారంలో దూసుకుపోతున్నాయి.  ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలతో మంత్రి కేటీఆర్‌ శనివారం  హైదరాబాద్‌లో భేటీ నిర్వహించారు. ఈ సందర్భగా టీఆర్‌ఎస్‌లోని కొంతమంది పార్టీ నేతల తీరుపై మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాయకులు ప్రచారం చేయకుండా ఉంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ఇంట్లో కూర్చుంటాం అంటే కుదరదని,  అందరూ కలిసి ప్రచారం చేయాలని గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. సమావేశానికి ఎవరెవరు రాలేదో తనకు తెలుసని అన్నారు. పదవుల కోసం ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్నవారు చాలామంది ఉన్నారని, అవకాశాన్ని బట్టి పదవులు అవే వస్తాయని కేటీఆర్‌ పేర్కొన్నారు.
చదవండి: 
తెలంగాణ ఉద్యమకారుడికి కేటీఆర్‌ సాయం
‘కేటీఆర్‌ పీఏ’నంటూ ఫోన్‌.. డబ్బు డిమాండ్‌ 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు