-

టీపీసీసీ, టీబీజేపీ కేసీఆర్‌ పెట్టిన భిక్ష: కేటీఆర్‌

4 Oct, 2021 18:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతుంది అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బీజేపీ నేత బండి సంజయ్‌ తిన్నది అరక్క పాదయాత్ర చేస్తున్నాడు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్‌ మండి పడ్డారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. 

‘‘స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్లలో  60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఇన్ని ఏళ్ళు మీరు ఏం చేశారు. ఫ్లోరైడ్‌తో నల్గొండ అతలాకుతలం అయింది. కాంగ్రెస్ పార్టీ పాపాలు పెరిగినట్టు ఫ్లోరోసిస్ పెరిగింది. మంచి నీటిని అందిస్తున్న కేసీఆర్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు’’ అని కేటీఆర్‌ మండిపడ్డారు.
(చదవండి: TRS: తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పు పట్టిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే)

‘‘తెలంగాణ మొదటి ద్రోహి రేవంత్ రెడ్డి. జంగ్ లేదు బొంగు లేదు జంగ్ సైరన్ లేదు. రేవంత్‌ రెడ్డి.. మాణిక్కం ఠాగూర్‌కి 50 కోట్ల రూపాయలు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నాడని వాళ్ళ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. టీపీసీసీ, టీబీజేపీ కేసీఆర్ పెట్టిన భిక్ష. అలాంటి పెద్ద మనిషిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు’’ అని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
(చదవండి: కేటీఆర్‌ వాహనానికి చలాన్‌.. ట్రాఫిక్‌ ఎస్‌ఐని అభినందించిన మంత్రి)

‘‘ఇంటింటికి నీరు ఇచ్చే పథకాన్ని కేంద్రం మెచ్చుకుంది. భారత దేశాన్ని సాకుతున్న రాష్ట్రల్లో తెలంగాణది నాలుగో స్థానం అని ఆర్బీఐ చెప్పింది. రాష్ట్రం మొత్తం దళిత బంధు ఇస్తాం. ఎవరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. సీఎం కేసీఆర్ కూడా దళిత బంధుని రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని చెప్పారు’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

చదవండి: కేసీఆర్, కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేస్తేనే.. యువతకు ఉద్యోగాలు

మరిన్ని వార్తలు