సమతామూర్తి విగ్రహావిష్కరణ.. సోషల్‌ మీడియాలో కాకపెంచిన కేటీఆర్‌ ట్వీట్‌

6 Feb, 2022 12:38 IST|Sakshi

Hyderabad: KTR Strongly Reacts On Modi: సమతామూర్తి విగ్రహావిష్కరణపై.. టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. మరోవైపు సోషల్‌ మీడియానూ వార్‌ నడుస్తోంది. తాజాగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ దుమారం రేపుతోంది.

సమతామూర్తి విగ్రహావిష్కరణ వివక్షకు నిలువెత్తు నిదర్శనమని, సమతామూర్తి స్ఫూర్తికే విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. పక్షపాతానికి ఐకాన్‌లాంటి వ్యక్తి(ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ..) సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారంటూ..  స్టాచ్యూ ఆఫ్‌  ఈక్వాలిటీ ట్యాగ్‌తో కేటీఆర్‌ ఒక ట్వీట్‌ చేయడం విశేషం. నిన్న తెలంగాణలో ఈక్వాలిటీ ఫర్‌ తెలంగాణ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ కాగా, ట్విటర్‌లో పెద్ద ఎత్తునే దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. కేటీఆర్‌ ట్వీట్‌కు బీజేపీ నేత రాజాసింగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు