హుజూరాబాద్‌లో ఓటమి.. వైరలవుతోన్న కేటీఆర్‌ ట్వీట్‌

2 Nov, 2021 18:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. ఒక్క ఎన్నిక ఫలితం పార్టీని ప్రభావితం చేయలేదు అన్నారు. గత 20 ఏళ్లలో టీఆర్‌ఎస్‌ అనేక ఎత్తుపల్లాలను చూసిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డ హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

ఇక హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. 24 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఈటల గెలుపొం‍దారు. ఈటల సెంటిమెంట్‌ ముందు కారు ఎత్తుగడలు ఏవి పనిచేయలేదు. దళిత బంధు టీఆర్‌ఎస్‌ను ఏమాత్రం ఆదుకోలేకపోయింది. 

చదవండి: కాంగ్రెస్‌లో హుజూరాబాద్‌ చిచ్చు: ‘బల్మూర్‌ వెంకట్‌ని బలి పశువు చేశారు’

మరిన్ని వార్తలు