కేటీఆర్‌ పర్యటన.. టీఆర్‌ఎస్‌ నేతలకు షాకిచ్చిన వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌

20 Apr, 2022 11:08 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె. తారకరామారావు పర్యటన నేపథ్యంలో వరంగల్‌ మున్సిపల్‌కార్పొరేషన్‌ టీఆర్‌ఎస్‌ నేతలకు షాకిచ్చింది. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినవారికి భారీ ఫైన్‌ విధించింది. వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణికి బల్దియా అధికారులు ఏకంగా రూ.2 లక్షలు జరిమానా విధించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు కేశవరావుకు రూ.50 వేల జరిమానా విధించారు. కాగా, నేడు కేటీఆర్‌ వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేయనున్నారు. మంత్రి రాక నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. జెండాలు, తోరణాలు, బ్యానర్లతో మడికొండ నుంచి వరంగల్‌ వరకు రోడ్లన్నీ గులాబీమయం అయ్యాయి. 

మరిన్ని వార్తలు