-

కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్‌ లేఖ.. ఏమన్నారంటే?

16 Feb, 2023 21:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతోంది. కేసీఆర్‌ ప్రభుత్వం వర్సెస్‌ కేంద్రం అన్న తీరుగా రాజకీయం నడుస్తోంది. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి ఐటీ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. తాజాగా కేటీఆర్‌ లేఖ పొలిటికల్‌గా చర్చనీయాంశంగా మారింది. 

అయితే, లేఖలో కేటీఆర్‌.. గుజరాత్‌ గిఫ్ట్‌ సిటీలో డేటా సెంటర్ల ఏర్పాట్లపై కేటీఆర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుకూలతలు లేని గుజరాత్‌లో డేటా ఎంబసీల ఏర్పాటుతో ప్రమాదాలొస్తాయన్నారు. తెలంగాణలో ఇంటర్నేషనల్‌ డేటా ఎంబసీలు ఏర్పాటు చేయాలన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణలో అన్ని అనుకూలతలున్నాయని కేటీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. డేటా సెంటర్లు ఒకే ప్రాంతంలో ఏర్పాటుతో సమస్యలు వస్తాయన్నారు. దేశ సరిహద్దు ఉన్న గుజరాత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటు అ‍త్యంత రిస్క్‌ అని అన్నారు. 

మరిన్ని వార్తలు