ఎన్నికల వేళ కేంద్ర హెం శాఖ కీలక నిర్ణయం.. ఆయనకు ‘వై’ కేటగిరి భద్రత

19 Feb, 2022 19:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ నాయకుల మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) మాజీ నేత కుమార్‌ విశ్వాస్‌ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్‌.. పంజాబ్ ముఖ్య‌మంత్రి లేదంటే ఖలిస్తాన్ ప్ర‌ధాని కావాలని అనుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఆయన వ్యాఖ్యలపై కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. తాను వేర్పాటు వాదినే అయితే అరెస్ట్‌ చేయలేదన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇలా నేతల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కుమార్ విశ్వాస్‌కు వై కేట‌గిరీ భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నట్టు హోం శాఖ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే కుమార్‌ విశ్వాస్‌కు ముప్పు పొంచి ఉందనే నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రత కల్పించినట్టు హోం శాఖ తెలిపింది. 

‘వై’ కేట‌గిరీ భ‌ద్ర‌త ఇదే..

వై కేటగిరి భ‌ద్ర‌త‌లో మొత్తం 11 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. వీరిలో ఇద్ద‌రు సీఆర్పీఎఫ్ క‌మాండోలు విధులు నిర్వర్తిస్తారు. అయితే, వీరిలో కొంత మంది కుమార్ విశ్వాస్ నివాసం వ‌ద్ద భ‌ద్ర‌త‌లో ఉంటారు. మిగిలిన వారు కుమార్ విశ్వాస్ ఎటు వెళ్లినా ఆయ‌నతో పాటే వెళ్తారు.  

మరిన్ని వార్తలు