‘చంద్రబాబును టెన్షన్‌ పెడుతున్న ‘కుప్పం’.. జారిపోతుందా?’

26 Aug, 2022 18:15 IST|Sakshi

సాక్షి, అమరావతి: కుప్పంకు చంద్రబాబు చేసింది సున్నా అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక కుప్పం మున్సిపాలిటీ అయింది. అవసరం కోసమే కుప్పంను చంద్రబాబు వాడుకుంటున్నారు. కుప్పం ప్రజలు సీఎం జగన్‌ పక్షాన ఉన్నారని మంత్రి అన్నారు.
చదవండి: కుప్పంలో టీడీపీ గూండాగిరి

చంద్రబాబు 33 ఏళ్లు కుప్పంలో శాసన సభ్యుడిగా ఉన్నారు.. ఈ మధ్య పదే పదే కుప్పం వెళ్తున్నారు. కుప్పం తన చేతిలోంచి జారిపోతుందనే భయం పట్టుకున్నట్లు ఉంది. వైఎస్సార్‌సీపీ అధికారంలో వచ్చాక కుప్పంలో చంద్రబాబుకి గెలుపే లేదు. మున్సిపల్, జిల్లా పరిషత్, సర్పంచ్.. ఏ ఎన్నికల్లో కూడా డిపాజిట్లు రాలేదని మంత్రి అన్నారు. కుప్పంలో కూడా పార్టీ, ప్రాంతం అనేది లేకుండా సీఎం జగన్‌ సంక్షేమ ఫలాలు అందించారన్నారు.

‘‘కుప్పం కూలే పరిస్థితి వచ్చింది.. ఇది వాస్తవం. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటావ్.. ఎవరిది ఆరిపోయే దీపం చంద్రబాబు. అధికారులపైకి వెళ్లడానికి ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచినంత సులభం కాదు. ఈ మూడు రోజులు చంద్రబాబు బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్థం అవుతుంది. కుప్పం జారిపోతుంది.. కూలిపోతుంది అనే ఆవేదన చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు