పెదరాశి పెద్దమ్మ కబుర్లు ఆపాలి: కురసాల కన్నబాబు

13 Sep, 2022 17:44 IST|Sakshi

సాక్షి, కాకినాడ: అమరావతి-అరసవిల్లి యాత్రను ఒక మహా ఉద్యమంగా ఈనాడు దిన పత్రిక చిత్రీకరించడాన్ని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తప్పుపట్టారు. ఇది నారా వారి కథ.. స్క్రీన్‌ ప్లే అని మేము మొదటి నుంచి చెప్తున్నాం. అందుకు అనుగుణంగానే వారు కూడా వాళ్ల మనోభావాలను ఎక్కడా దాచుకోలేదు. పైగా నారా హమారా.. అమరావతి హమారా నినాదాలు ఇచ్చినటు​ ఈనాడులో రాశారు. 

టీడీపీ సభ్యులకు దమ్ముంటే అమరావతిపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలి. చంద్రబాబు బయట, సభ్యులు అసెంబ్లీ లోపల ఉండటం కాదు. ఆయన్ను కూడా అసెంబ్లీకి తీసుకురావాలి. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా వద్దనే హక్కు మీకెక్కడదని ప్రశ్నించారు. అమరావతిపై విమర్శలు చేస్తే బుచ్చయ్య చౌదరికి కోపం రావడంలో తప్పు లేదు. అయితే అమరావతిపై బుచ్చయ్య చౌదరి చెప్పే పెదరాశి పెద్దమ్మ కబుర్లు ఆపాలని మాజీ మంత్రి కురసాల కన్నబాబు సూచించారు.

చదవండి: (రాజధాని అమరావతి అసైన్డ్‌ భూముల స్కామ్‌లో ఐదుగురు అరెస్ట్‌)

మరిన్ని వార్తలు