‘చంద్రబాబే పెద్ద వైరస్‌లా తయారయ్యాడు’

9 May, 2021 17:31 IST|Sakshi

కాకినాడ: ఏపీలో ఉన్న కోవిడ్‌ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో వసతులు ఉన్నాయని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. కరోనా కట్టడిపై రాష్ట్రం తీసుకుంటున్న చర్యలపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ''కరోనా కట్టడికి ప్రభుత్వం ఆహర్నిశలు చర్యలు చేపడుతోంది. చంద్రబాబు అబద్ధాలను పదేపదే ప్రచారం చేస్తున్నారు. జాతీయ విపత్తు వచ్చినప్పుడు ఎలా ఉండాలో చంద్రబాబుకు తెలియట్లేదు. దేశంలో ప్రజలంతా భయబ్రాంతులకు గురవుతుంటే.. చంద్రబాబు ప్రజల్లో మరింత విషప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు తానుచేసే పనికి సిగ్గు అనిపించట్లేదా?  రాష్ట్రానికి చంద్రబాబే పెద్ద వైరస్‌లా తయారయ్యాడు.  రాజకీయాల కోసం చంద్రబాబు ఏదైనా చేస్తారు. 

చంద్రబాబు ప్రతిపక్ష నేతగా సలహాలు ఇవ్వడం మానేసి..ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారు. చంద్రబాబు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు రోజురోజుకూ దిగజారి ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు దుష్ప్రచారం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రాష్ట్రంలో అశాంతిని చంద్రబాబు కోరుకుంటున్నారు. చంద్రబాబు పక్క రాష్ట్రంలో ఉంటూ వదంతులు ప్రచారం చేస్తున్నారు.దేశంలో రెండే సంస్థలు కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఉత్పత్తి సామర్థ్యం దృష్ట్యా అందరికీ వ్యాక్సిన్‌ వేయాలంటే.. కొన్ని నెలల సమయం పడుతుంది.

ఈ విషయం చంద్రబాబుకు తెలియదా?, రాష్ట్రానికి వచ్చిన వ్యాక్సిన్లను ఎప్పటికప్పుడు ఉచితంగా వేస్తున్నాం. రామోజీరావు ఒక అడుగు ముందుకు వేసి..భారత్‌ బయోటెక్‌ను ఒప్పించి కోవిడ్‌ టీకాలు ఇప్పించాలి. అందుకయ్యే ఖర్చు రూ.1600 కోట్లు మీ అకౌంట్‌లో వేస్తాం. టీకాల ఇండెంట్‌ ఎవరికి పంపించాలో చెప్పండి, పంపిస్తాం. 4 కోట్ల టీకాలు కావాలని కేంద్రానికి, అధికారులకు సీఎం లేఖలు రాశారు. ఒక్కరోజులోనే 6 లక్షల టీకాలు వేసిన ఘనత ఒక్క ఏపీకే ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలోను లేని యంత్రాంగం ఒక్క ఏపీకే ఉంది. చంద్రబాబు బాధ్యత లేకుండా జూమ్‌లో మాట్లాడుతున్నారు. జాతీయ విపత్తులోనూ వాస్తవాలను చెప్పలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు ఎందుకు ఇంత దిగజారి ప్రవర్తిస్తున్నారు?, బాబుకు అధికారం పోయినప్పటి నుంచి పచ్చమీడియాకు నిద్ర పట్టట్లేదు’ అని కన్నబాబు విమర్శించారు.
చదవండి: ఒట్టి చేతులతో వచ్చారేంటి..! సీఎస్‌పై గవర్నర్‌ ఆగ్రహం

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు