చంద్రబాబుపై కన్నబాబు సంచలన కామెంట్స్‌

15 Feb, 2023 20:32 IST|Sakshi

సాక్షి, కాకినాడ: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. 

కాగా, కన్నబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబే. దేవుడు.. చంద్రబాబుకు మతిమరుపు అనే వరం ఇచ్చాడు. నారా లోకేష్‌.. పెద్ద ఐరన్‌ లెగ్‌ అని ప్రజలు అనుకుంటున్నారు. గుంటూరు, కందుకూరులో అమాయకులను పొట్టనపెట్టుకున్నారు. రాష్ట్రానికి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది. ప్రతీ పేదవాడి గుండె చప్పుడు సీఎం జగన్‌ వింటున్నారు. పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు చనిపోయారు. 

2019 తర్వాత ఏ ఒక్క ఎన్నికల్లోనైనా టీడీపీ గెలిచిందా?. టీడీపీకి బలం లేకనే మిగిలిన పార్టీలను కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు.. పోలవరం నేను కట్టేస్తానంటూ కేంద్రం దగ్గరం అనుమతి తెచ్చుకున్నావు. ముందు స్పిల్‌ వే కట్టాలి.. తర్వాత కాఫర్‌ డ్యామ్‌ కట్టాలి. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడానికి చంద్రబాబే కారణం. పోలవరం ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. నిర్వాసితులను గాలికి వదిలేసి కాలక్షేపం చేశారు. ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. 

సీఎం జగన్‌ వచ్చిన తర్వాత 6 లక్షలు ఉద్యోగాలు ఇచ్చాము. చంద్రబాబును మించిన సైకో ఎవరూ లేరు. ప్రభుత్వం మీద బురద చల్లడమే టీడీపీ ఎజెండా. టీడీపీ తప్పుడు ప్రచారాలకు ఎల్లోమీడియా సపోర్ట్‌ చేస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌నే గెలిపిస్తామని ప్రజలే చెబుతున్నారు. వాలంటీర్‌ వ్యవస్థ మీదపడి టీడీపీ ఏడుస్తోంది. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా?. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాము’ అని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు