ఎల్లో మీడియా రోజులు కాదు.. సోషల్‌ మీడియా రోజులివి: కన్నబాబు ఫైర్‌

23 Feb, 2023 15:00 IST|Sakshi

సాక్షి, కాకినాడ: టీడీపీ, ఎల్లో మీడియాపై మాజీ మంత్రి కన్నబాబు సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. విష ప్రచారమే అజెండాగా ఎల్లోమీడియా పనిచేస్తోందన్నారు. గన్నవరంలో పథకం ప్రకారమే పట్టాభి డ్రామా క్రియేట్‌ చేశాడని ఘాటు విమర్శలు చేశారు. 

కాగా, కన్నబాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఎల్లోమీడియా రోజురోజుకూ దిగజారుతోంది. చంద్రబాబు కోసమే ఎల్లో మీడియా పనిచేస్తోంది. చంద్రబాబు చెప్పినట్లు బరితెగించి విష ప్రచారం చేస్తున్నారు. గన్నవరంలో పట్టాభి డ్రామా క్రియేట్‌ చేశాడు. ఈనాడులో తప్పుడు ఫొటోలు వేసి దుష్ప్రచారం చేశారు. పట్టాభిని కొట్టారంటూ అబద్ధపు రాతలు రాశారు. తప్పుడు వార్తలు రాసి సవరణ మాత్రం సింగిల్‌ కాలమ్‌లో వేశారు. ఇవి ఎల్లో మీడియాలో రోజులు కావు.. సోషల్‌ మీడియా రోజులు అని అన్నారు. 

జాకీలు పెట్టి లేపినా లేవలేని పరిస్థితి టీడీపీది. ఈనాడు చంద్రబాబు కరపత్రిక అని మరోసారి రుజువైంది. పట్టాభిని ఎవరూ కొట్టలేదని వైద్యులే ధృవీకరించారు. ఈనాడు విషపురాతలను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక భాగం కేటాయించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక విప్లవానికి తెరతీశారు. దేశంలో ఎవరూ చేయని సాహసం సీఎం జగన్‌ చేశారు. కరోనా వంటి కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు ఆగలేదు. ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రభుత్వంపై ఈనాడు కుట్ర చేస్తోంది. అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితిలో టీడీపీ ఉంది. 

మరిన్ని వార్తలు